Site icon NTV Telugu

Pawan Kalyan and Chandrababu: మరోసారి చంద్రబాబుతో పవన్‌ భేటీ.. వాటిపై ఫోకస్‌

Babu Pk

Babu Pk

Pawan Kalyan and Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులు ఖరారు అయ్యాయి.. సీట్ల సంఖ్య కూడా తేలిపోయింది.. కానీ, కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ రానట్టుగా ప్రచారం సాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబుతో మరోసారి సమావేశం అయ్యారు జనసేనాని పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నారు.. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం.. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు.. తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం..

Read Also: Vivo T3 5G Launch: వివో నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ధర, స్పెసిఫికేషన్స్‌ ఇవే!

అయితే, సీట్ల విషయంలో తుదికసరత్తులో భాగంగానే ఈ సమావేశం అయినట్టు తెలుస్తోంది. జనసేన ఇంకా ఐదు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.. అలాగే టీడీపీ 17 ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై క్లారిటీతో పాటు.. 16 అసెంబ్లీ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టింది.. ఇక, బీజేపీతో సీట్ల సర్దుబాటుపై కూడా కొంత కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ఎవరి కసరత్తు వారు చేస్తున్నా.. ఉమ్మడిగా నిర్వహించాల్సిన ప్రచారంపై కూడా చంద్రబాబు-పవన్‌ మధ్య చర్చ సాగే సూచనలు కలిపిస్తున్నాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో.. చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రజల్లోకి వెళ్తుండగా.. పవన్‌ కల్యాణ్‌.. మరోసారి వారాహి యాత్రతో క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ఈ భేటీలో.. సభలు, సమావేశాలు.. ఉమ్మడి సభలు.. ఇలా చాలా విషయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

Exit mobile version