NTV Telugu Site icon

Pawan Kalyan: ఒక ఎన్నిక కోసం పిఠాపురం రాలేదు

Pawan

Pawan

Pawan Kalyan: తాను ఈ ఒక ఎన్నిక కోసం పిఠాపురం రాలేదని స్పష్టం చేశారు జనసేన అధినేత, పిఠాపురం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌.. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం కావాలన్నారు.. పిఠాపురంలో నేను మాత్రమే కాదు.. వర్మ, నేను పోటీ చేస్తున్నాం అన్నారు. ఇక, టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ.. సమిష్టి నాయకత్వంతో పిఠాపురంలో పనిచేస్తున్నాం అన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి.. కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్మ లేకుండా కాదు.. వర్మతో కలిసి పిఠాపురంలో పనిచేస్తున్నాం అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో మూడు పార్టీలు పోటీ చేస్తున్నట్లు భావించాలని.. కూటమి అభ్యర్థుల విజయానికి అంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. కాగా, నేను ఒక ఎన్నిక కోసం పిఠాపురం రావడం లేదు, ఇక్కడే ఒక ఇల్లు తీసుకుని, ఒక పర్మనెంట్ కార్యాలయం తీసుకుని 54 గ్రామాల భాధ్యత తీసుకుంటాను అంటూ గతంలో పిఠాపురం వారాహి విజయ భేరి సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన విషయం విదితమే.

Read Also: DK Shivakumar: కాంగ్రెస్‌కు ఓట్లేస్తేనే నీళ్లు.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

ఇక, పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి వర్మ, నాయకులు త్యాగం చేసి తనకు సీటు కేటాయించారని, గెలిచి అందరి రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.. పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నా. నన్ను చాలా గౌరవిస్తున్నారు.. ఆయన రుణం తీర్చుకుంటా. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే ఆయనకు మద్దతిచ్చానని స్పష్టం చేశారు. ఇక, కాకినాడ జిల్లా కొత్తపల్లిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ నాయకులను ఇన్‌ఛార్జి వర్మ, నేతలు, కార్యకర్తలను పవన్‌కు పరిచయం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు నేతలు.