Site icon NTV Telugu

Pawan Kalyan: వెంకటేశ్వర స్వామి కంటే అతను గొప్పవాడని అనుకుంటున్నారు..

Pawan

Pawan

తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గోవిందా.. గోవిందా అంటూ స్పీచ్ మొదలెట్టారు. అన్నీ సర్వేలు కూటమిదే విజయం అంటోందని తెలిపారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ ను ఎమ్మెల్యేగా గెలిపించడం అవసరమా అని ప్రశ్నించారు. పేదలకు సేవ చేసే ఆరిణి శ్రీనివాసులను గెలిపించుకుందామని పవన్ కల్యాణ్ తెలిపారు.

Prajwal Revanna: వీడియోల లీక్‌పై కుమారస్వామి తీవ్ర ఆరోపణలు

రేణిగుంట నుండి అమరరాజా కంపెనీ, వోల్టాస్, రియల్ లైన్ కంపెనీల తరిమేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తిరుపతిలో ఇళ్ళు కట్టుకోవాలంటే పదిశాతం కమీషన్ ఇవ్వాలన్నారు. మరోవైపు.. తాము అధికారంలోకి రాగానే, రెండో మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం భాగ్యం కల్పిస్తామని అన్నారు. తిరుమలను వైసీపీ ప్రభుత్వం రిసార్ట్‌ లా మార్చారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. టీడీపీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలపై వెంకన్న స్వామి ఫొటో కాకుండా జగన్ ఫొటో వేస్తారా అని మండిపడ్డారు. జగన్ ఫొటో ఎందుకు టీడీపీ ఇంటి పట్టాలపై ఎందుకు వేశారని ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామి కంటే జగన్ గొప్పవాడని వైసీపీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

PM Modi: “ఇండీ కూటమి మరింత ఆవిరైపోతోంది”.. మూడో దశ తర్వాత పీఎం ట్వీట్..

తాము అధికారంలోకి రాగానే.. తిరుమల పవిత్రత కాపాడుతామన్నారు. ఏడు కొండలు కాదు రెండు కొండల అన్న వ్యక్తి ఏమాయ్యాడు అందరికీ తెలుసన్నారు. వైసీపీ వాళ్ళు ఓట్ల కోసం ఇచ్చే డబ్బు వెంకన్న స్వామిదని.. ఆ డబ్బును తీసుకుని వెంకన్న హుండీలో వేసేయండని పవన్ కల్యాణ్ అన్నారు.

Exit mobile version