NTV Telugu Site icon

Janasena Chief: కక్ష సాధింపునకు ఇది సమయం కాదు.. అలాంటివి నేను ఎంక‌రేజ్ చేయ‌ను..!

Jansena Chief

Jansena Chief

Pawan Kalyan: జనసేన శాసన సభాపక్ష సమావేశంలో పవన్‌ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. పాతతరం రాజకీయాలు పోయాయి.. కూర్చొని పవర్‌ ఎంజాయ్‌ చేద్దామంటే కుదరదు.. ప్రజలు మనకు ఎంత మద్దతిచ్చారో.. వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు.. ప్రజలు ఏదైనా సందర్భంలో అసహనంతో ఓ మాట మాట్లాడినా భరించాలి.. ఇది తప్పదు.. వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు. ఐదేళ్ల కాలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యేలతో తరుచూ సమావేశమవుతాను.. మిత్రపక్షాలతో కలిసి వెళ్తూనే.. మన గుర్తింపును తెచ్చుకోవాలి.. జనం మనల్ని నమ్మబట్టే ఈ స్థాయి విజయాన్ని మనకు చేకూర్చారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Read Also: Nabha Natesh: అబ్భా అనిపిస్తున్న నాభ నటేష్ అందాలు..

రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావాలి అని జనసేన చీఫ్ పవన్ పేర్కొన్నారు. కక్ష సాధింపునకు ఇది సమయం కాదు.. గతంలో అలా చేశారు కాబట్టి.. మనమూ అలాగే చేయాలని అనుకోవద్దు.. కక్ష సాధింపును నేను ఎంకరేజ్‌ చేయను అంటూ తెలిపారు. రిజిస్టర్డ్‌ పొలిటికల్‌ పార్టీ నుంచి రికగ్నైజ్డ్‌ పొలిటికల్ పార్టీగా అవతరించాం.. దేశంలో ఎవ్వరికి లేని రికార్డు 100 శాతం స్ట్రైకింగ్‌ రేట్‌ మనకు వచ్చింది.. ప్రజలకు మనపై ఎంత విశ్వాసాన్ని ఉంచారో అర్థం చేసుకోవాలన్నారు. నియోజక వర్గాల సమస్యలను ప్రయార్టీల వారీగా పరిష్కరించాలి.. చిన్న సమస్యలు మొదలుకుని.. పెద్ద సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి.. విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, శాంతి భద్రతలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టాలని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.