Site icon NTV Telugu

Pawan Kalyan: బీజేపీకి సీట్ల వ్యవహారంలో మేం నష్టపోయాం..! పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య సీట్ల వ్యవహారం తేలిపోయింది.. బీజేపీ కోసం జనసేన మూడు అసెంబ్లీ స్థానాలు త్యాగం చేయాల్సి వచ్చింది.. టీడీపీ కూడా మరోస్థానాన్ని వదులుకుంది.. అయితే, బీజేపీకి సీట్లు ఇచ్చే వ్యవహారంలో జనసేన పార్టీ నష్టపోయిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ.. పొత్తుల వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేస్తే ఏమవుద్దో నాకు ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్షేమం కోసం నేను ఈ పని చేస్తున్నాను అని స్పష్టం చేశారు. పెద్ద మనసు చేసుకుంటే చిన్న పోవాల్సి వచ్చిందన్నారు. మా అన్న నాగబాబు టికెట్ కోసం త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. టికెట్ల రానివాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడతారు అన్నారు. వ్యక్తిగతంగా తిట్టినా పర్లేదు.. కానీ, పొత్తుకు ఇబ్బంది కలిగితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు పవన్‌ కల్యాణ్.

Read Also: US Intel Report: భారత్‌-చైనా మధ్య సాయుధ ఘర్షణ!.. అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

ఇక, నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు పోటీ చేయాలని కొందరు పెద్దలు కోరారు.. క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అనే చర్చ జరిగిందని తెలిపారు పవన్‌.. 2104లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేయాలని కోరారు.. ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను.. నా మనసులో ఎమ్మెల్యే ఉంది.. నేను ఎంపీగా పోటీ చేస్తానా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.. ఇప్పుడే ఎస్ లేదా నో అని వ్యాఖ్యానించలేను అన్నారు. మరోవైపు.. 2019లో 30 స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నాను.. అందరూ ఒత్తిడి చేస్తే నిస్సహాయతతో ఒదిలేశాను అన్నారు. నేను ఓడిపోతున్నా అని కూడా నాకు తెలుసు.. భీమవరంలో కూడా ఓడిపోతాను అని కూడా నాకు ప్రచారం ముగిసిన వెంటనే తెలిసిందన్నారు. గాజువాక ఎలాగో ఓడి పోతాను అని ముందే తెలుసన్న ఆయన.. ఇవన్నీ తట్టుకుని నేను ఉన్నాను అని వెల్లడించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version