NTV Telugu Site icon

Pawan Kalyan Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. సెకండ్ సెకండ్‌కు పెరుగుతున్న ఫాలోవర్స్!

Pawan Kalyan Janasena

Pawan Kalyan Janasena

Power Star Pawan Kalyan Makes A Grand Entrance On Instagram Today: గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తారు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. ఈ రోజు (జులై 4) ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అధికారిక ఖాతాని తెరిచారు. ఈ ఇన్‌స్టా అకౌంట్‌కి సెకండ్ సెకండ్‌కు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇప్పటికే 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. అయితే ఈ ఇన్‌స్టా అకౌంట్‌ని పవన్ టీం మేనేజ్ చేస్తుంది. ఈ ఇన్‌స్టాలో రాజకీయాలకి సంబంధించిన పోస్టులే చేస్తారని, సినిమాకు సంబంధించిన పోస్ట్స్ చేయకపోవచ్చని సమాచారం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన అభిమానులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తారు. ఇప్పటికే జనసేన అధికారిక వెబ్ సైట్, ట్విట్టర్ ద్వారా తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేస్తున్నారు. ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కూడా పవన్ తన అభిమానులు, కార్యకర్తలకు నిత్యం టచ్‌లోనే ఉండనున్నారు. ఏపీ రాజకీయాలలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దూకుడు పెంచిన పవన్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైవు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. రాజకీయాలలో ప్రజల వద్దకు వెళ్లేందుకు ‘వారాహి విజయ యాత్ర’ ద్వారా శ్రీకారం చుట్టారు. మొదటి విడత వారాహి యాత్ర సక్సెస్ కావడంతో.. రెండో విడత యాత్ర ప్రారంభించాలని సిద్ధం అవుతున్నారు. మరోవైపు బ్రో, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల్లో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ ప్రస్తుతం నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయి. సాయి తేజ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ జూలై 28న థియేటర్లలోకి రానుంది.

Also Read: Mangalavaaram Teaser: ఒరేయ్ పులి.. నువ్ కాసేపు పూ మూసుకుని గమ్మునుండరా! ఆసక్తిగా మంగళవారం టీజర్

Also Read: iPhone 15 Launch 2023: సెప్టెంబర్ 5న ఐఫోన్ 15 లాంచ్.. అదనంగా 5 ఫీచర్లు! యాపిల్ లవర్స్‌కు పండగే

 

 

Show comments