Site icon NTV Telugu

Pawan Kalyan: 96 ఏళ్ల వృద్దురాలితో కలిసి భోజనం చేసిన పవన్.. కారణం ఏంటంటే?

Pawan Kalyan Ap

Pawan Kalyan Ap

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తన వీరాభిమాని అయిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలుతో కలిసి భోజనం చేశారు. పేరంటాలు కోరిక మేరకు ఈరోజు జనసేన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి.. ఆవిడతో కలిసి పవన్ భోజనం చేశారు. అంతేకాదు చీర, లక్ష రూపాయల నగదును కూడా అందించారు. డిప్యూటీ సీఎంను కలవడమే కాకూండా.. భోజనం చేయడంతో పేరంటాలు సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్‌తో పేరంటాలు భోజనం వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏపీ అధికారికి డిమోషన్‌!

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన పోతుల పేరంటాలు.. పవన్‌ కల్యాణ్‌, జనసేన పార్టీకి వీరాభిమాని. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ తెలిసిందే. పవన్ మీది అభిమానంతో ఆయన విజయం సాధించాలని గ్రామంలోని వేగులమ్మ తల్లికి పేరంటాలు పొర్లు దండాలు పెట్టారు. పవన్‌ గెలిస్తే అమ్మవారికి గరగ చేయించి సమర్పిస్తానని మొక్కుకున్నారు. పవన్ భారీ మెజారితో గెలవడంతో.. తనకు వచ్చే పింఛను సొమ్ములో రూ.2,500 చొప్పున పోగు చేసింది. 2025 మే నెలతో రూ.27 వేలు కాగా.. ఆ సొమ్ముతో అమ్మవారికి గరగ చేయించి సోమవారం సమర్పించారు. ఈ సందర్భంగా పవన్‌తో కలిసి భోజనం చేయాలనుందని చెప్పారు. విషయం తెలుకున్న డిప్యూటీ సీఎం ఈరోజు పేరంటాలును క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు.

Pawan Kalyan

Exit mobile version