Pawan Kalyan: గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మార్చే కీలక ప్రాజెక్టు అడవి తల్లి బాట.. ఈ ప్రాజెక్టు కింద కొత్త రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తవ్వాలని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా 625 గిరిజన ఆవాసాలను రహదారి సౌకర్యంతో అనుసంధానించేందుకు రూ.1005 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలవుతోందన్నారు. పీఎం జన్ మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, అలాగే ఉప ప్రణాళిక నిధులను వినియోగించి ఈ పనులు చేపడుతున్నారని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులు పనుల పురోగతిని పవన్ కి వివరించారు. కొండ ప్రాంతాలు, నిటారుగా ఉన్న మార్గాలు, వర్షాల దెబ్బ… ఇవన్నీ పనుల వేగాన్ని తగ్గిస్తున్నాయన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 128 రహదారులలో 98కి ఇప్పటికే అటవీ అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు 186 పనులు ప్రారంభమయ్యాయి, మరో 20 పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి రహదారి సౌకర్యం అందుకోబోతున్న గిరిజన ఆవాసాలు ఉన్నాయన్నారు. స్థానిక ప్రజలకు ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలియజేయడం, వారి సహకారం పొందడం అత్యవసరమని సూచించారు. నిరంతర పర్యవేక్షణతో పనులు వేగవంతం చేసి డోలీరహిత గిరిజన ఆవాసాలు లక్ష్యాన్ని సాధించాలని స్పష్టం చేశారు.
READ MORE: Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీకి జెలెన్‌స్కీ ఆహ్వానం.. వైట్‌హౌస్ ఏం చెప్పిందంటే..!
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలను విన్నారు. స్థానిక కౌందు భాషలో వారితో మాట్లాడించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను 6 నెలలలో తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్ మన్ పథకం కింద మంజూరైన రహదారులకు పవన్ శంకుస్థాపన చేశారు. పెదపాడు గ్రామంలో గడ్డపార పట్టి భూమి పూజ చేశారు. అంగన్వాడి కేంద్రంలో గర్భిణులకు కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలోని చిన్నారులకు తనతో తెచ్చిన స్వీట్ బాక్స్‌లను ఇచ్చారు. గ్రామస్తులతో ముఖాముఖిలో వారు అడిగిన 12 సమస్యలను ఆరు నెలల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ కు డిప్యూటీ సీఎం సూచించారు. జన్ మన్ పథకం కింద అల్లూరి ఏజెన్సీకి 167 రోడ్లు మంజూరయ్యాయన్నారు.
READ MORE: Mohammed Siraj: ప్రేమాయణం అంటూ పుకార్లు.. రాఖీతో చెక్ పెట్టిన సిరాజ్
