Site icon NTV Telugu

Janasena SCST Subplan: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో నిర్లక్ష్యం సిగ్గుచేటు

Pawan 2

Pawan 2

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై జనసేన పార్టీ కార్యాలయంలో సదస్సు జరిగింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు.. సంక్షేమానికి కృషి చేస్తామంటూ జనసేన డిక్లరేషన్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలును మరో పదేళ్లు కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడం కంటి తుడుపు చర్యేనంటూ డిక్లరేషన్ లో దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ శాశ్వతంగా అమలయ్యేలా చట్టం రూపకల్పనకు జనసేన డిమాండ్ చేసింది.సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పలు అంశాలు ప్రస్తావించారు. సబ్ ప్లాన్ అమలు చేయని జగనుపై ఎన్ని కేసులు పెట్టాలన్నారు సదస్సులో పాల్గొన్న వక్తలు.. జగన్ పోవాలి.. పవన్ రావాలి. పవన్ దెబ్బకు భయపడి జగన్ కొత్త జీవోలు తెస్తున్నారు.

Read Also: Boga Shravani : ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పోతున్నా

ఏపీలో మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులకు మాత్రమే. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది. నవరత్నాల పేరుతో దళితుల భవిష్యత్తుకు ఉరేస్తున్నారు.ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నిధులు కూడా రావడం లేదు.. దీన్ని పవన్ ప్రశ్నించాలి.27 ఎస్సీ, ఎస్టీ పథకాలు రద్దు చేశారు.దళితులకు విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని వక్తలు మండిపడ్డారు.

 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సహా ప్రతి విషయంలోనూ పారదర్శకంగా నిలబడతాం.ఇంత శాతం మంది జనాభా ఉండి కూడా నిధులివ్వండీ అని అభ్యర్థించుకునే పరిస్థితి.జగన్ కోసం ప్రార్ధనలు చేశారు.. ఉపవాసాలు చేశారు.తమ కుటుంబ సభ్యుడే జైలుకెళ్లినట్టు దళితులు బాధపడ్డారు.కానీ అలాంటి వారి మీదే జగన్ కేసులు పెడతానంటే ఎలా..?సమాజంలో గుడ్డి ద్వేషం మంచిది కాదు.కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే.. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడంలో తప్పు లేదు.కానీ కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టి.. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు.నేను మీ వాడిని అని నేను చెప్పను.. మీకు అనిపించాలి.నా పని తీరు నచ్చి.. మీరే నన్ను అక్కున చేర్చుకోవాలి.

మన పక్కనే ఉండి.. మన ఎదుగుదలను దెబ్బ కొట్టే వాడి గురించి ఆలోచించాలి. ఇంత మంది ఎమ్మెల్యేలు.. మంత్రులు ఉండి సబ్ ప్లాన్ గురించి ఎందుకు మాట్లాడరు..?అధికార పార్టీకి చెందిన దళిత ఐఆర్ఎస్ బంధువు ఇంట్లో పెళ్లికి నన్ను ఆహ్వానించారు.నేను వస్తే మీ పార్టీలో మీకు ఇబ్బందని నేను చెప్పా.. ఇబ్బందేం ఉండదన్నారు.కానీ ఆ తర్వాత రావద్దులెండీ అన్నారు.నేను వస్తే సీఎం హోదా స్థాయి వ్యక్తి రానన్నంటారా..?అదే సీఎం స్థాయి వ్యక్తి నేను వెళ్లిన పెద్ద పెద్ద ఇండస్ట్రిలియస్టుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు.. ఫంక్షన్లకు వచ్చారు.నన్ను ఆహ్వానించొద్దని ఆ పెద్జలకు చెప్పగలిగారా..?దళితుడు కాబట్టే ఆ ఐఆర్ఎస్ అధికారికి చెప్పగలిగారన్నారు పవన్ కళ్యాణ్.

Read Also: Padi Kaushik Reddy : హుజురాబాద్ అభివృద్ది కోసం ఈటల రాజేందర్ తట్టెడు మట్టి పోయలేదు

Exit mobile version