Pawan Kalyan Fans: పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. కడప నగరంలోని రాజా థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ హంగామా సృష్టిస్తున్నారు.. బైక్ సౌండ్స్ తో కేరింతలు కొడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటి సినిమా హరిహర వీరమల్లు విడుదలతో కేరింతలు కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.. థియేటర్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే జనసైనికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు..
READ MORE: Suryapet: నిండు ప్రాణం బలి తీసుకున్న వాట్సాప్ ఎమోజీ.. కొట్టి చంపేశారు..
ఇదిలా ఉండగా.. నైజాం ఏరియాలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఈ షోలు పడుతున్నాయి. సినిమాలకు ఫేమస్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. థియేటర్ ముందు హంగామా నెలకొంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పుష్ప-2 ఘటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి అనుమతిస్తున్నారు. థియేటర్ లోపల కూడా పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రీమియర్స్ షో అయిపోయే దాకా థియేటర్ చుట్టుపక్కల జనాలు గుమిగూడకుండా అందరినీ పంపించేస్తున్నారు.
READ MORE: Fake Doctor: మగ పిల్లాడు కావాలనుకుంటున్నారా..? ఒక్క ఇంజక్షన్ చాలంటూ మోసం..!
