Site icon NTV Telugu

Pawan Kalyan Fan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలని అభిమాని పోర్లు దండాలు..

Pawan

Pawan

హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మేజార్టీతో విజయం సాధించాలని కోరుతూ తిరుమలలోని జపాలి ఆంజనేయస్వామి ఆలయంలోని మెట్ల పై నుంచి పోర్లు దండాలు పెడుతూ మొక్కులు చెల్లించుకున్నారు పవన్ అభిమాని ఈశ్వర్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈ నెల 4వ తేదీ వెలువడే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటూ కోరుకున్నారు. ఇక, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిమాని ఈశ్వర్ తెలిపారు.

Exit mobile version