Site icon NTV Telugu

Pawan Kalyan: స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినీ పరిశ్రమలో కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆ పేరే ఓ ప్రభంజనం. ఆయన నటనలో ఉండే వేగం, స్టైల్‌లో ఉండే మేనరిజమ్స్ అన్నింటికి అసంఖ్యాక ఫాన్స్ ఉన్నారు. అలాగే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం విరామం తర్వాత, జనవరి 7, 2026న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక “కొత్త దశ” ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సోషల్ మీడియా అకౌంట్ లో ప్రత్యేక్షమైన ఒక వీడియో ఫ్యాన్స్ మామూలు సర్‌ప్రైజ్ చేయదు.

READ ALSO: Sankranti Brahmotsavams 2026: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల తేదీల ప్రకటన.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ రోజు ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో, జపాన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక ఎర్రటి సూర్యుడు, దానికి రెండు వైపులా జపాన్‌లో రాసిన అక్షరాలు, చివర్లో కటానా కత్తి ఒరలో పెడుతున్న పీకే అనే అక్షరాలు కలిగిన టీషర్ట్‌ను ధరించిన వ్యక్తి(పవన్ కళ్యాణ్ కావచ్చు) కనిపిస్తున్నారు. ఇది కేవలం ఒక సినిమా గురించి అనౌన్స్ మెంట్ మాత్రమే కాదు, యుద్ధ విద్యల పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న మక్కువను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారని తాజాగా రిలీజ్ అయిన వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. చివర్లో పవన్ కళ్యాణ్ తన కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పటి ఫోటో కనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ తన కెరీర్ ఆరంభం నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘జానీ’ వంటి సినిమాల్లో ఆయన మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శించిన విన్యాసాలు అప్పట్లో యూత్‌లో మామూలు సంచలనాన్ని సృష్టించ లేదు. ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమే కాకుండా, తన సినిమాల కోసం నిరంతరం సాధన చేస్తూనే ఉండటం విశేషం. అప్పటి వరకు తెలుగు తెరపై చూడని సరికొత్త ఫైట్ కంపోజిషన్లను ఆయన స్వయంగా డిజైన్ చేసుకునేవారు. ఈ వీడియో దేని గురించి అయి ఉండవచ్చు? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆయన గతంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకునే యువత కోసం ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చాయి. బహుశా ఆ దిశగా అడుగులు పడుతున్నాయేమో వేచి చూడాలి. లేకపోతే ఆయన నుంచి మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంపై ఏదైనా స్ఫూర్తిదాయకమైన సిరీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి ఈ వీడియో దేనికి సంబంధించినదో అనేది..

READ ALSO: Healthy Hair: చుండ్రుకు చెక్ పెడుతున్న మ్యాజిక్ హెయిర్ ఆయిల్..

Exit mobile version