Pawan Kalyan: ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కీలక విషయాలను తాజాగా మాట్లాడారు. తిరుమల దేవస్థానం కేవలం యాత్ర స్థలం మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని పేర్కొన్నారు. తిరుమల యాత్ర అనేది “భక్తి దైవానుగ్రహాన్ని కలుసుకునే స్థలం” అని పవన్ అన్నారు. అలాగే “తిరుమల లడ్డూ కేవలం స్వీట్ కాదు.. అది భక్తుల విశ్వాసానికి ప్రతీక” అని అన్నారు. భక్తులు ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులతో పంచుకోవడం దైవానుగ్రహంగా భావిస్తారని అన్నారు. ప్రతి సంవత్సరం సగటున 2.5 కోట్ల మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారని తెలిపారు.
సనాతన సంప్రదాయాలు, ఆచారాలను ఎవరైనా హేళన చేస్తే, అది కేవలం భక్తుల మనోభావాలను దెబ్బతీయడం మాత్రమే కాకుండా.. దేవాలయంపై ఉన్న విశ్వాసాన్నే దెబ్బతీసినట్లేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సనాతన ధర్మం అనేది భక్తుల సమిష్టి భావజాలం, వాటిని తేలికగా తీసే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. సనాతన ధర్మం ప్రపంచంలోనే పురాతనమైన నాగరికతని.. ఇది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ వస్తోందని అన్నారు. తిరుమల, వేంకటేశ్వరస్వామి, లడ్డూ ప్రసాదం ఇవన్నీ భక్తుల హృదయంలో నిలిచిపోయిన విశ్వాసపు బంధం అని పవన్ అన్నారు. అలాగే సెక్యులరిజం అంటే ఒకపక్క మాత్రమే కాదు.. రెండు వైపులా సమాన గౌరవం ఉండాలన్నారు. మత విశ్వాసాలకు రక్షణ, గౌరవం ఇవ్వడం రాజీపడే అంశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందన్నారు. ఇది ఏ ఒక్క వర్గం నిర్ణయం కాదని.. అన్ని వర్గాల, అన్ని భాగస్వాముల ఏకాభిప్రాయంతో ముందుకు రావాల్సిన విషయం అని పేర్కొన్నారు.
Delhi Car blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్‌తో జైషే మహ్మద్‌కు సంబంధం.?
