Badri @23 years: ‘నువ్వు నంద వైతే.. నేను బద్రి.. బద్రినాథ్’ అంటూ ఒక్క డైలాగ్ తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్ కల్యాణ్ సినిమా ‘బద్రి’ రిలీజై 23ఏళ్లయింది. పవన్ కల్యాణ్ అనగానే టక్కున తను నటించిన బద్రి సినిమా డైలాగే గుర్తుకువస్తుంది. అంతగా పాపులర్ అయింది ఆ డైలాగ్. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు లాంటి హాట్రిక్ విజయాలతో మాంచి ఫాంలో ఉన్నారు పవన్ కల్యాణ్ స్పీడులో ఉన్నాడు. అప్పడే పూరి జగన్నాథ్ ను నమ్మి తనకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు పవన్. పూరి టేకింగ్ కొత్తగా ఉండడంతో ఆ సినిమాను ప్రేక్షకులు భారీ బ్లాక్ బస్టర్ చేశారు. దీంతో పూరి జగన్నాథ్, పవన్ కల్యాణ్ రేంజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది.
Read Also: Atiq Ahmed: అతిఖ్‌ను ఒక రోజు ముందే చంపేందుకు యత్నించారు.. కానీ..
బద్రి సినిమాను టి త్రివిక్రమ రావు నిర్మించారు. ఈ చిత్రం ఆ రోజుల్లోనే రూ. 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించారు. పవన్ కల్యాణ్ సరసన రేణు దేశాయ్, అమీషా పటేల నటించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రమే మొదటిది. ఈ చిత్రంలోనే బాలీవుడ్ నటి అమీషా పటేల్ తెలుగు తెరకు పరిచయమైంది. అటు రేణు దేశాయ్ కు కూడా ఇదే తొలి చిత్రం. ఈ సినిమా తర్వాత పవన్, రేణు ప్రేమలో పడిపోయారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా ప్రకాష్ రాజ్ హీరోయిన్ అన్నగా.. విలన్ పాత్రలో నటించాడు. ప్రకాష్ రాజ్, పవన్ కల్యాణ్ మధ్య డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ గా నిలిచాయి. బద్రి సినిమాకు రమణ గోగుల అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్. 23 యేళ్ల క్రితం తెలుగు సినిమాలో హిందీ పాట పెట్టడం అప్పట్లో సెన్సేషన్. తమ్ముడు తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. బద్రి సినిమా పవన్ కెరీర్లోనే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఈ సినిమాతో రేణు దేశాయ్.. అతని జీవిత భాగస్వామిగా మారింది. అటు దర్శకుడిగా పూరీ జగన్నాథ్ ఫాంలోకి వచ్చారు.
Read Also:Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 12 వేలు దాటిన కేసులు