Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాను వేళ పవన్ కళ్యాణ్ కీలక ట్వీట్.. బాధితులకు భరోసా..!

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చిందని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు.

READ MORE: Lucky Biscuit: 10 రూపాయల బిస్కెట్ ఎంత పని చేసిందో తెలుసా…

“తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని బియ్యం 25 కేజీలు (మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కేజీలు), కందిపప్పు కేజీ, పామాయిల్ ఒక లీటర్, ఉల్లిపాయలు కేజీ, బంగాళాదుంపలు కేజీ, పంచదార కేజీ చొప్పున అందిస్తారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆదేశాలను అనుసరించి ఆ శాఖ అధికార యంత్రాంగం అన్ని రేషన్ షాపులకు వీటిని చేర్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతోపాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి నిత్యావసరాల పంపిణీని సమన్వయం చేస్తున్నారు.” అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

READ MORE: Cyclone Montha Effect: విద్యుత్ సరఫరాపై మొంథా బీభత్సం.. కృష్ణా జిల్లాలో 4 కోట్ల నష్టం!

Exit mobile version