Site icon NTV Telugu

Pawan Kalyan: సినిమా పిచ్చిలో పడిపోకండి.. ప్రేక్షకులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు..

Pawan Kalyan

Pawan Kalyan

AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సినిమా పిచ్చిలో పడొపోవద్దని హితవు పలికారు. ఏదైనా ఓ పరిమితి వరకే ఉండాలనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలతో ఎంతో మంది అభిమానులను కూడబెట్టుకన్న పవన్ ప్రేక్షకులకు ఇలాంటి గొప్ప సూచనలు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. నేనూ ఓ నటుడిగా చెబుతున్నాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అసలు పవన్ ఇంకా ఏమన్నారో తెలుసుకుందాం..

READ MORE: Road Collapse: అకస్మాత్తుగా కుంగిపోయిన రోడ్డు..కేంద్ర మంత్రిపై స్థానికుల ఆగ్రహం

“పొద్దున లేస్తే బూతులు తిట్టే వ్యక్తులను చూడకండి.. టీవీలలో వారిని చూడకండి.. సినిమా పిచ్చిలో పడిపోకండి.. సినిమా ఓ చిన్నపాటి వినోదం మాత్రమే.. దాన్ని జీవితంగా తీసుకోకండి.. నేను ఒక సినిమా నటుడిగా చెబుతున్నా.. మన కోసం కష్టపడిన అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోండి. ఎన్నో మంచి పనులు చేసిన పెద్దలను స్పూర్తిగా తీసుకోండి.. మనం చూడా ఏదైనా సాధించి సమాజానికి ఏదైనా చేయాలి. మీరందరూ ఈ మాటలను దృష్టిలో పెట్టుకోండి. మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, మీ వ్యక్తిత్వం రేపటి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

READ MORE: Varanasi : రాజమౌళి గ్లోబల్ ప్లాన్ లీక్.. థియేటర్లలో ‘వారణాసి’ టీజర్ ప్లాన్ ?

Exit mobile version