Site icon NTV Telugu

Pawan Kalyan: ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు.. చంద్రగిరిలో లక్షకు పైగానే..!

Pawan

Pawan

Pawan Kalyan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. విజయవాడలో చంద్రబాబుతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో సమావేశమై.. రాష్ట్రంలోని పరిస్థితులను సీఈసీ రాజీవ్ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్.. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని సీఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. సీఈసీ బృందం విజయవాడ వచ్చి సమావేశం ఏర్పాటు చేసింది. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలు సీఈసీకి చెప్పారన్నారు. ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు నమోదు చేయించారు.. కేవలం చంద్రగిరిలో దాదాపు లక్ష పైచిలుకు దొంగ ఓట్లు నమోదయ్యాయని. నమోదైన లక్ష పైచిలుకు దొంగ ఓట్లలో కొన్ని ఆమోదం కూడా జరిగాయన్నారు.

Read Also: Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్?

ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశాం అన్నారు పవన్‌ కల్యాణ్.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయి.. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేసి కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి ఫిర్యాదు చేశాం. వైసీపీ కోసం పనిచేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్‌ వ్యవస్థను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించకుండా ఉండాలని సూచించాం.. ప్రశాంతవాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరాం.. ఇక, సీఈసీ రాజీవ్‌ కుమార్‌.. ఈ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టినట్టు చెప్పారని వెల్లడించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version