Pawan Kalyan: తన ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ నేత పంచకర్ల రమేష్ బాబు.. జనసేనలో చేరిన సందర్భంగా మాట్లాడిన పవన్.. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై మరోసారి మండిపడ్డారు.. ఇక, వాలంటీర్ల ద్వారా జరుగుతోన్న డేటా చౌర్యంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చెప్పాను అన్నారు.. ఏపీలో డేటా చోరీపై కేంద్రానికి ఫిర్యాదు చేశాను. సీఎం వైఎస్ జగన్ చెప్పినట్టు చేస్తే వాలంటీర్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.. ప్రజలపై నిఘా పెడుతున్నారు. డేటా ద్వారా దోపిడీ.. దొంగతనం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Telangana IT: తెలంగాణ ఐటీ పాలసీ భేష్.. అధ్యయనానికి వచ్చిన తమిళనాడు ఐటీ బృందం
ఇక, నన్ను ప్రాసిక్యూషన్ చేయాలనుకుంటే చేసుకోండి.. నేను రెడీ అని ప్రకటించారు పవన్.. నన్ను ప్రాసిక్యూట్ చేయమని ప్రభుత్వం జీవో జారీ చేసింది. నేనోసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకునే చెబుతాను. నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి నేను సిద్ధమే అన్నారు. నేను ఏపీ అభివృద్ధికి కమిట్ మెంటుతో ఉన్నాను. నన్ను ప్రాసిక్యూషన్ చేయాలనుకుంటే చేయండి.. నేను సిద్దమే అని స్పష్టం చేశారు. అయితే, మర్డర్లు చేసిన వారికి ప్రాసిక్యూషన్ ఉండదా..? అని ప్రశ్నించారు.. పొరపాటున మానభంగాలు జరిగిపోతాయనే మంత్రులున్నారు.. వారిని ప్రాసిక్యూట్ చేయరా..? అని ప్రశ్నించారు. రెడ్ క్రాస్ వంటి సంస్థకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా సేవలు అందించే వారిని వలంటీర్లు అంటారు. రూ. 5 వేల వేతనం తీసుకునే వాళ్లని వాలంటీర్లు అనకూడదన్నారు.. వాలంటీర్ల ద్వారా సేకరిస్తోన్న సమాచారం ఎక్కడకెళ్తోంది? అని నిలదీశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.