NTV Telugu Site icon

Pawan Kalyan : జనసేన నేతల దీక్షను భగ్నం చేసిన తీరు ఆక్షేపణీయం

Pawan

Pawan

చిందేపల్లిలో జనసేన నేతల దీక్షను భగ్నం చేసిన తీరు ఆక్షేపణీయమన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మూడు రోజులుగా చేస్తున్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన తీరు ఆక్షేపణీయంగా ఉందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా జనసేన నాయకురాలు కోట వినుత, ఆమె భర్త పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన గొంతెత్తడమే నేరం అన్నట్లు వైసీపీ ప్రజా ప్రతినిధులు వ్యూహరచన చేస్తూ అధికార గణాన్ని నడిపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : CM Jagan : ఏప్రిల్‌ 3న ముఖ్య నేతలతో సీఎం జగన్‌ భేటీ.. పార్టీ వర్గాల్లో చర్చ

నిరాహార దీక్ష చేస్తున్నవారిపై బల ప్రయోగం చేయడమే కాకుండా వారిపై 307, ఎస్సీ, ,ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ వంటి బలమైన 14 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారన్నది సుస్పష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలంతా అర్ధం చేసుకుంటున్నారన్నారు. అదుపులోకి తీసుకున్న జనసేన నాయకులను ఈ రోజు ఇళ్లకు పంపించారని ఆయన అన్నారు. అదే విధంగా గ్రామస్తుల కోరిక మేరకు రహదారిని పునరుద్ధరించాలని ఆయన కోరారు. కేసులన్నీ తక్షణం ఉపసంహరించుకోవాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. చిందేపల్లి వాసులకు జనసేన భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Also Read : New Parliament: కొత్త పార్లమెంట్ అదిరింది.. ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ..