NTV Telugu Site icon

Pawan Kalyan : వీరమల్లును ఢీకొట్టేందుకు వస్తున్న ఆ ఇద్దరు.. పోరులో గెలిచేదెవరు ?

Harihara Veeramallu

Harihara Veeramallu

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పీరియాడిక్ జోనర్ లో చేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఆఖరి దశలో ఉన్నది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితం మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చాలా సార్లు వాయిదాల మీద వాయిదాలు పడింది. దీని తర్వాత స్టార్ట్ చేసిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయ్యాయి.. సూపర్ హిట్ కూడా అయ్యాయి. కానీ ఇంకా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసే పనిలోనే ఉంది. జ్యోతికృష్ణ ఈ పెండింగ్ షూట్ మొత్తం ఫినిష్ చేస్తారని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో క్రిష్ ఈ సినిమా కోసం మళ్లీ వస్తారని సమాచారం. వచ్చే ఏడాది అంటే 2025 మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీకి రూ.200 కోట్ల బడ్జెట్ దాటిపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘VD 12’ మూవీ కూడా మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Read Also:Telangana TET Notification: తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల..

అయితే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కన్ఫర్మ్ చేయడంతో ‘VD 12’ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కి సోలో రిలీజ్ డేట్ దొరికే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. అదే టైంలో ఇతర భాషలలో సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తుండడం కూడా ఓ కారణమే. మలయాళం నుంచి మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘లూసిఫర్’ సీక్వెల్ ‘L2: ఎంపురన్’ మార్చి 27న రిలీజ్ కాబోతోంది. దీంతో పాటుగా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సికందర్’ కూడా మార్చి 28నే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. కచ్చితంగా ఈ చిత్రాలు పవన్ ‘హరిహర వీరమల్లు’ కి గట్టి పోటీ ఇవ్వడం గ్యారెంటీ అనుకుంటున్నారు.

Read Also:Events in November at Tirumala: ఉత్సవాల సీజన్‌గా నవంబర్‌.. తిరుమలలో విశేష కార్యక్రమాలు ఇవే..

హిందీలో సల్మాన్ ఖాన్ తో పోటీ పడడం అంటే పెద్ద రిస్కే అని చెప్పొచ్చు. అలాగే మలయాళంలో మోహన్ లాల్ ‘L2’ పైన ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించే చాన్సులు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ‘హరిహర వీరమల్లు’ కి పోటీగా రిలీజ్ అయితే మాత్రం కచ్చితంగా సినిమా కలెక్షన్స్ పై వాటి ఇంపాక్ట్ ఉంటుందని ట్రేడ్ పండితుల అంచనా. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ కి నేషనల్ వైడ్ గా ఇమేజ్ వచ్చింది. ఇది ‘హరిహర వీరమల్లు’ కి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

Show comments