Site icon NTV Telugu

Pavan Murder Case : డెగావత్ పవన్ హత్య కేసును ఛేదించిన బాలాపూర్ పోలీసులు

Pavan

Pavan

రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డెగావత్ పవన్ హత్య కేసును ఛేదించారు బాలాపూర్ పోలీసులు. కేసుకు సంబంధించిన వివరాలను మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. నాగర్ కర్నూల్ ప్రాంతానికి చెందిన డెగావత్ పవన్ కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి పాతబస్తీ వాదియే ఉమర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే పక్కనే ఉంటున్న ఓ యువతితో పరిచయమై ప్రేమగా మారింది. దీంతో విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరు కుటుంబాలకు గొడవలు అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి పహాడి షరీఫ్ ప్రాంతంలో ఉంటున్నారు. అయినా కూడా ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుంది.

Also Read : RGV Song On Dogs: మేయర్ పై ఆర్జీవీ సాంగ్‌.. పాపం ఎవరిది అంటూ పాటతో ప్రశ్న

దీంతో యువతి బాబాయ్ గౌస్, సద్దాం అనే వ్యక్తులు విషయాన్ని ఎంజీఎం మీడియా ప్రతినిధి మహమ్మద్ మహమూద్ వద్దకు తీసుకెళ్లారు. అయితే డెగావత్‌ పవన్ కుటుంబ సభ్యులను ఎంజీఎం మీడియా ప్రతినిధి 5 లక్షలు యువతి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని లేదంటే బాగుండదని బెదిరించడంతో మూడు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అదే రోజు రాత్రి 12 గంటలకు పవన్ వాష్ రూమ్ కోసం ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. అయితే పవన్ కోసం మాటు వేసి ఉన్న సద్దాం, గౌస్ లు పవన్ పై కత్తులతో దాడి చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పవన్ ను హత్య చేసిన గౌస్ తో పాటు సద్దాం, ఎంజీఎం మీడియా ప్రతినిధి మహమ్మద్ మహమూద్‌ను అరెస్టు చేసి వారి వద్ద రెండు కత్తులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

Also Read : Japan: పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతున్న నగరం.. ఎగబడి వెళ్తున్న జపాన్ ప్రజలు!

Exit mobile version