NTV Telugu Site icon

Pavan kalyan: ఎమ్మెల్యే నిజంగా చిత్తశుద్ధిగా పనిచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం.. పవన్ కళ్యాణ్..!

13

13

ఆదివారం నాడు ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఆయన పలు ఆసక్తికరమైన ప్రకటనలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇదివరకు శ్రీలంకలో జరిగిన లాగానే తాడేపల్లి ప్యాలెస్ లోకి కూడా ప్రజలు వెళ్లి తిరగబడే రోజు చాలా దగ్గరలో ఉందంటూ ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే తెనాలి నుండి విజయవాడ వరకు నాలుగు లైన్ రోడ్డు విస్తరిస్తామంటూ తెలియజేశారు.

Also read: Manchu Manoj: ఇంటికి వచ్చేసిన మహాలక్ష్మి.. మౌనిక, మనోజ్ లు పాపతో కలిసి ఇంటికి..!

ఒకవేళ అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే మాత్రం తెనాలి బాగా అభివృద్ధి చెందేదని.. అలాగే కొల్లిపర ప్రాంతంలో కృష్ణ నదిపై చెక్ డ్యాములను నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం తెనాలిలోని కాలువలు పూడికతో దుర్గంధం వెదజల్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే తెనాలికి ఈ బాధ నుండి విముక్తి కల్పిస్తామంటూ తెలియజేశాడు.

Also read: Improve Your Memory: ఇవి తింటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!

అలాగే కులగణంకాలతో పాటు, ప్రతిభాగణంకాలు కూడా లెక్క వేయాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మహిళల గురించి ప్రస్తావిస్తూ.. మహిళలు వంటింటికి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదని., ఆర్థిక అభివృద్ధి కోసం మహిళలకు తాము చేయూతనియబోతున్నట్లు తెలియజేశాడు. ప్రజల ఇంటి దగ్గరికే వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కోసం కోర్సులు అందించేలా తాము చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే.. ఎవరైనా మహిళలపై చేయి వేయాలంటే భయపడేలా చట్టాలు తీసుకువస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ కౌలు రైతులను ఆదుకున్న సాయం మెగాస్టార్ చిరంజీవిని కూడా కదిలించిందని., అందుకే ఆయన జనసేనకు ఐదు కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ఆయన తెలిపారు.

Show comments