NTV Telugu Site icon

Bihar Reservations: బీహార్ సీఎంకు షాక్.. ఆ చట్టాన్ని రద్దు చేసిన పాట్నా హైకోర్ట్..

Patna

Patna

Bihar Reservations: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాట్నా హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా ఓబీసీ, ఈబీసీ, దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచింది. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన వారికి (అగ్ర కులాలు) 10 శాతం రిజర్వేషన్‌తో సహా, బీహార్‌లో ఉద్యోగ, ప్రవేశ కోటా 75 శాతానికి పెరిగింది. ఈ విషయంపై యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థ దీనిని పాట్నా హైకోర్టులో సవాలు చేసింది. అదే అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ రిజర్వేషన్లను పెంచే ఈ చట్టాన్ని రద్దు చేసింది.

Read Also: Kajal Aggarwal : కన్ఫ్యూషన్ లో పడ్డ కాజల్ కెరీర్..

ఇక, బీహార్ పోస్టులు సేవల (సవరణ) చట్టం 2023, బీహార్ రిజర్వేషన్ (విద్యా సంస్థలలో ప్రవేశాలలో) (సవరణ) చట్టం 2023 రెండు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వం యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తుంది అని తెలిపింది.

Read Also: Rachakonda Police: అందుకే కదా అర్థాంగి అంటారు.. ఫన్నీ స్టోరీ పోస్ట్ చేసిన రాచకొండ పోలీస్..

కాగా, గత ఏడాది సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను సవాలు చేస్తూ పలు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌లపై ఈ రోజు విచారణ చేసిన హైకోర్టు.. గతంలో సుప్రీంకోర్టు వివరించిన రాజ్యాంగ పథకంపై రాష్ట్ర శాసనసభను మళ్లీ చట్టాన్ని అనుమతించలేమని తెలిపింది. ఇంద్ర సాహ్ని లాంటి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ.. 50శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు రాజ్యాంగ సమానత్వ ప్రమాణాన్ని ఉల్లంఘించడమేనని ధర్మాసనం చెప్పుకొచ్చింది.