NTV Telugu Site icon

Vijayawada Floods : విజయవాడ ముంపు ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి..

Vijaywada Flood

Vijaywada Flood

విజయవాడలోని సితార, రాజరాజేశ్వరి పేట, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ముంపు కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలకు పూర్తిగా ఇళ్లు మునగడం తో అపార్ట్మెంట్ల పైన, కొండలపైన తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు. వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఇళ్ల వద్దకు వచ్చి పరిస్థితి ఏరకంగా ఉందో చూసుకుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లు ముంపు ప్రాంతాలకు తరలించారు. భారీ క్రేన్లు కూడా సిద్ధం చేశారు అధికారులు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లోకి బోట్లు, ట్రాక్టర్లు, క్రేన్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. అయితే.. తాగునీరు, బిస్కెట్లు, ఫుడ్ ప్యాకెట్లు అందించే లారీలను ముంపు ప్రాంతాలలో బాధితులకు పంపుతున్నారు అధికారులు. విజయవాడలోని అనేక వరద ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం డ్రోన్లు, హెలీకాప్టర్ల ద్వారా ఆహారం, నీరు అందిస్తున్నా.. అందరికీ అందడం లేదని చెబుతున్నారు.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

విజయవాడ వరద బాధితులకు మేఘా సాయం అందించేందుకు ముందుకొచ్చింది. లక్షన్నర మందికి అల్పాహారం, భోజనం, వాటర్‌ బాటిల్స్‌ అందివ్వాలని నిర్ణయించింది. హరేకృష్ణ సంస్థ సహకారంతో ఆహారం పంపిణీ చేయనుంది. విజయవాడ కలెక్టరేట్‌లో మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రతినిధులు ఆహారం అందించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుండి మూడు హెలీకాప్టర్లు వచ్చాయి. హకింగ్ పేట ఎయిర్ బేస్ నుండి మరో నాలుగు హెలీకాప్టర్లు రానున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు.

Rahul Gandhi: హర్యానా ఎన్నికల్లో ఆప్‌తో పొత్తుపెట్టుకునేందుకు రాహుల్ గాంధీ ఆసక్తి..

Show comments