Anil Ravipudi: టాలీవుడ్‌లో కమర్షియల్ హంగులతో వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు అనిల్ రావిపూడిది అందె వేసిన చెయ్యి. ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘పటాస్’. నందమూరి కల్యాణ్ రామ్‌ను మాస్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్న పటాస్ సినిమా గురించి ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటి, డైరెక్టర్ అనిల్ రావిపూడికి పటాస్ హీరోగా ఫస్ట్ ఛాయిస్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒక కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన మొదటి సినిమా పటాస్ కథ పట్టుకుని ముందుగా హీరో రామ్ పోతినేని దగ్గరికే వెళ్లినట్లు వెల్లడించారు. కథ వినగానే రామ్ ఒక్క నిమిషం పాటు పూర్తిగా టెంప్ట్ అయిపోయ్యారని, కథ అద్భుతంగా ఉందని, కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అప్పుడే రామ్ చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఆ టైంలో ఆయన పోలీసుగా చేయాలా అనే సందిగ్ధంలో ఆగిపోయి, 90 శాతం ఓకే అయిందని అనుకున్న సినిమా, కేవలం ఒక 10 శాతం అడ్డంకి వల్ల పట్టాలెక్కలేదని అనిల్ రావిపూడి వివరించారు. హీరో రామ్ పోతినేని ఇటీవలే ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
READ ALSO: 1 Nenokkadine: మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ట్రైలర్ బ్యాక్ స్టోరీ తెలుసా?
