Site icon NTV Telugu

Shocking : పటాన్‌చెరులో పరువు హత్య.. యువకుడిని కొట్టి చంపిన యువతి తల్లిదండ్రులు

Dead

Dead

Shocking : హైదరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమే కారణంగా ఓ యువకుడిని ఇంటికి పిలిపించి బ్యాట్లతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బీరంగూడ ప్రాంతానికి చెందిన సాయి (20), అదే ప్రాంతానికి చెందిన యువతి (19) గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పెళ్లి విషయంపై మాట్లాడతామని సాయిని ఇంటికి రావాలని పిలిచినట్లు సమాచారం. పెళ్లి అంగీకారం ఇస్తారన్న నమ్మకంతో సాయి శ్రీజ ఇంటికి వెళ్లాడు.

Anesthetic Injections : చాంద్రాయణగుట్ట మత్తు ఇంజెక్షన్ల కలకలం.. ఇద్దరు డాక్టర్లు అరెస్ట్

అయితే ఇంటికి వెళ్లిన వెంటనే అక్కడి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. శ్రీజ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి సాయిపై బ్యాట్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సాయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో కొద్ది సేపటికే సాయి మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రేమిస్తున్నాడన్న కారణంతోనే సాయిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, శ్రీజ తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

Shahid Afridi on RO-KO: రికార్డులు బద్దలు కొట్టడానికే ఉంటాయి.. రోహిత్ శర్మ రికార్డ్ పై ఆఫ్రిది ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Exit mobile version