Pat Cummins Revels Deathbed Moment in World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ పడిన క్షణాలను తాను ఎప్పటికీ మర్చిపోను అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరోసారి చెప్పాడు. జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు కూడా తనకు కోహ్లీ వికెట్ గుర్తొస్తుందన్నాడు. భారత అభిమానులతో నిండిన నరేంద్ర మోడీ మైదానం లైబ్రరీ అంత నిశ్శబ్దంగా పారిపోవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని కమిన్స్ పేర్కొన్నాడు. నవంబర్ 19న జరిగిన ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. భారత్ నిర్ధేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మరో 7 ఓవర్లు ఉండగానే ఛేదించింది.
వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీని ఆస్ట్రేలియా నగరాల్లో తిప్పుతున్నారు. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లో ‘ది ఏజ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్యాట్ కమిన్స్ పలు విషయాలపై స్పందించాడు. ’70 ఏళ్లు దాటిన తర్వాత మీరు మరణించే ముందు 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఏ క్షణాల గురించి ఆలోచిస్తారు?’ అని యాంకర్ పీటర్ ఫిట్జ్ సైమన్స్ అడగ్గా.. ‘విరాట్ కోహ్లీ వికెట్ గురించి ఆలోచిస్తా’ అని కమిన్స్ టక్కున సమాధానం ఇచ్చాడు. తనకు జీవితంలో అత్యంత అద్భుతమైన, సంతోషమైన క్షణం కోహ్లీ వికెట్ పడినప్పుడే అని చెప్పాడు.
Also Read: Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను వీడనున్న బుమ్రా.. కారణం అతడేనా?
‘విరాట్ కోహ్లీ వికెట్ పడిన సమయంలో నాకు చాలా ఆనందంగా అనిపించింది. విరాట్ వికెట్ తీసిన తర్వాత మా ఆటగాళ్లు అందరం ఒక చోటుకి చేరుకున్నాం. అప్పుడు స్టీవ్ స్మిత్ ‘ఒక్కసారి మైదానాన్ని చూడండి’ మాతో అన్నాడు. ఆ క్షణం స్టేడియంలో దాదాపు లక్ష మంది భారత అభిమానులు ఉన్నారు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ సమయంలో నరేంద్ర మోడీ మైదానం లైబ్రరీ అంత నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ క్షణాలను నేను చాలా కాలం పాటు ఆస్వాదిస్తాను’ అని ప్యాట్ కమిన్స్ వివరణ ఇచ్చాడు. కోహ్లీ వికెట్ పడిన క్షణాలను తాను ఎంతో ఎంజాయ్ చేశానని మ్యాచ్ అనంతరం కమిన్స్ చెప్పిన విషయం తెలిసిందే.