Site icon NTV Telugu

Passport Services: హైదరాబాద్ లో పాస్‌పోర్టు సేవలు బంద్‌.. స్పందించేవారే లేరు..

Paasport

Paasport

Passport Services: హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. ఒక రోజు రెండు కాదు ఒకే సారి ఐదురోజులుగా ఇదే జరుగుతుంది. బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకిల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ ను అధికారులు నిలిపివేశారు. వాస్తవానికి ఆన్‌లైన్‌లో ఈ కేంద్రాలకు స్లాట్‌లు ఉన్నట్లు కనిపించడంతో పెద్ద ఎత్తున నగరవాసులు. అయినా స్లాట్‌ లు బుకింగ్‌లు చేయడం లేదంటున్నారు. దీంతో నగరవాసులు పాస్ పోర్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సేవలు నేపథ్యంలో పాస్‌పోర్టు దరఖాస్తులు పెరుగుతాయి. డిమాండ్ భారీగా ఉంటుంది.

Read also: Anjali-Balakrishna: బాలకృష్ణపై ఆసక్తికర ట్వీట్.. అంజలి ఏం ఎన్నారంటే?

ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయ అధికారులు ఆయా మీసేవా కేంద్రాల్లో సేవలను నిలిపివేశారు. దీంతో నగరవాసులు ఇతర జిల్లాలకు పరుగులు తీస్తున్నారు. కాగా.. నగరవాసుల సంఖ్య పెరగడంతో పక్కనే ఉన్న మేడ్చల్, వికారాబాద్, నల్గొండ పాస్‌పోర్టు కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో.. పాస్‌పోర్టు కోసం ప్రయాణాల భారం మోపుతున్నారని నగర ప్రజలు వాపోతున్నారు. ఇక.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి ఫిర్యాదులు పంపుతున్నా స్పందించే వారు లేరని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు.
Palnadu SP: ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు..

Exit mobile version