Site icon NTV Telugu

Farmers Protest: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రైతుల పాస్‌పోర్టు, వీసా రద్దు..!

Farmers Protest

Farmers Protest

హర్యానా-పంజాబ్‌లోని శంభు సరిహద్దులో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో పలువురు యువకులు కూడా పాల్గొన్నారు. అయితే వారికి ఇదొక చేదువార్త అనే చెప్పవచ్చు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రైతులను గుర్తించి వారి పాస్‌పోర్టులు, వీసాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఢిల్లీలోకి రాకుండా వారిని నిలువరించేందుకు బారికేడ్లు, కంచెలు నిర్మించారు. అయితే వాటిని ధ్వంసం చేసిన రైతులపై అంబాలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Read Also: Uttar Pradesh: ప్రభుత్వ స్కీమ్ పొందేందుకు భర్తనే మార్చేసింది.. వేరే వ్యక్తితో పెళ్లి తంతు..

సరిహద్దులో అలజడి సృష్టిస్తున్న పలువురు రైతుల ఫోటోలను అంబాలా పోలీసులు మీడియాకు తెలిపారు. ధ్వంసం చేసిన చాలా మంది రైతుల ఫొటోలను అంబాలా పోలీసులు.. పాస్‌పోర్ట్ కార్యాలయంతో పాటు పోలీస్ అధికారులకు షేర్ చేశారు. హోం మంత్రిత్వ శాఖ మరియు భారత రాయబార కార్యాలయంతో భాగస్వామ్యం చేయనున్నారు. దీంతో.. వారి పాస్‌పోర్టులు, వీసాలు రద్దు కానున్నాయి.

Read Also: Jharkhand: జమ్తారాలో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి

శంభు సరిహద్దులో అమర్చిన సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌లలో వారి వీడియోలు రికార్డు అయ్యాయి. ఈ సందర్భంగా.. అంబాలా డీఎస్పీ జోగిందర్ శర్మ మాట్లాడుతూ.. ధ్వంసం చేసిన రైతుల ఫోటోలను పాస్‌పోర్ట్ కార్యాలయంతో పాటు హోం మంత్రిత్వ శాఖ మరియు భారత రాయబార కార్యాలయానికి పంపుతామని.. దీంతో వారి పాస్‌పోర్ట్‌లు, వీసాలు రద్దు కానున్నట్లు చెప్పారు.

Exit mobile version