NTV Telugu Site icon

Viral video:ఇదేందయ్యా ఇది…బోగీల్లో కరెంటు లేదని టీటీఈని టాయిలెట్‌లో బంధించిన ప్రయాణికులు!

Tte

Tte

Passengers Locked TTE in the Train Toilet: బోగీలకు కరెంటు సరఫరా లేకపోవడం ఓ ట్రెయిన్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ)కి శాపంగా మారింది. టికెట్లు ఉన్నయా? లేవా? అని అయితే చూస్తారు కానీ సౌకర్యాల గురించి పట్టించుకోరా అంటూ ఆగ్రహించిన ప్రయాణీకులు టీటీఈని టాయిలెట్ లో బంధించారు. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల ప్రకారం సుహైల్‌దేవ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారంనాడు ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ టెర్మినల్‌ నుంచి ఘాజీపూర్‌కు బయలుదేరింది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా రైలులోని B1, B2 బోగీలకు విద్యుత్‌ సరఫరా కాలేదు. దీంతో ఆ బోగీల్లో ఉన్న ఏసీలు పని చేయలేదు.దీంతో గాలి ఆడక ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఆగ్రహించిన ప్రయాణికులు రైలులో ఉన్న టీటీఈని నిలదీశారు.

Also Read: Stealing Purse: అయ్యో పాపం… పర్స్ కొట్టేయడానికి ట్రై చేసి ఇలా బుక్ అయిపోయాడేంటి..!

అనంతరం ఆయనను ట్రెయిన్‌ టాయిలెట్‌లో బంధించారు. అంతటితో ఆగకుండా ఆయనను టాయిలెట్ లో బంధించారు. టీటీఈ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ప్రయాణీకులను సముదాయించి టీటీఈని బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత టెక్నికల్‌ ఇంజినీర్ల విద్యుత్‌ సమస్యను పరిష్కరించడంతో ప్రయాణీకులు శాంతించారు. అయితే ఈ వీడియో చూసిన కొందరు ప్రభుత్వ ఉద్యోగి పట్ల ఇలా ప్రవర్తించడం దారుణమని కామెంట్ చేస్తున్నారు.