Site icon NTV Telugu

China: చైనాలో ఘోర బస్సు ప్రమాదం.. 14 మంది మృతి, 37 మందికి తీవ్రగాయాలు

China

China

Bus Accident in China: చైనాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో మంగళవారం ప్రయాణికుల బస్సు సొరంగం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చైనా ప్రభుత్వ మీడియా బుధవారం సమాచారం ఇచ్చింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హుబేయ్ ఎక్స్‌ప్రెస్‌వేపై మధ్యాహ్నం 2:37 గంటలకు (0637 GMT) ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడి క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Read Also: Dogs Shootout: పెంపుడు కుక్కని చంపడంతో.. 20 వీధి కుక్కలను అతి కిరాతకంగా..?

మరో ఘటనలో.. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న తైజౌలోని ఒక వృత్తి విద్యా పాఠశాల వద్ద ఒక కారు మంగళవారం జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. తైజౌ ఒకేషనల్ అండ్ టెక్నికల్ కాలేజీలో ఉదయం 11:20 గంటలకు ఈ సంఘటన జరిగింది. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. మార్చి 1న, తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని డెజావో నివాస ప్రాంతంలో ఒక కారు వ్యక్తుల సమూహంపైకి దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులు మరణించగా.. అనేక మంది పిల్లలు గాయపడ్డారు.

Exit mobile version