NTV Telugu Site icon

Kenya: కొత్త పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన.. పార్లమెంట్ భవనానికి నిప్పు

Fie

Fie

ప్రజల ఆందోళనలు, నిరసనలతో కెన్యా పార్లమెంట్ పరిసరాలు అట్టుడికింది. పార్లమెంట్‌లో కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టి మంగళవారం ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. వీరిని నిలువరించేందుకు భద్రతా బలగాలు భాష్పవాయువు, నీటి ఫిరంగులు ఉపయోగించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కొంత భాగం మంటల్లో కాలిపోయింది.

ఇది కూడా చదవండి: Bharateeyudu 2 : ఆయనే మళ్ళీ వచ్చాడు.. ఆ భయాన్ని మళ్ళీ తెచ్చాడు!

పరిస్థితులు చేదాటిపోవడంతో పోలీసులు గుంపులను చెదరగొట్టడానికి ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ఇక నిరసనకారులు కూడా భద్రతా దళాలపై రాళ్ళు విసిరారు. ఇలా ఉద్రిక్త పరిస్థితుల్లో పలువురికి గాయాలయ్యాయి. అలాగే భద్రతా దళాలు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పన్నులను పెంచే ఆర్థిక బిల్లుకు కెన్యా పార్లమెంట్ మంగళవారమే ఆమోదం తెలిపింది.

ఇది కూడా చదవండి: Worms in Biscuit Packet: బిస్కెట్ ప్యాకెట్లలో పురుగులు.. తింటే నరకానికి గేట్ పాస్..