వరల్డ్ వైడ్ గా విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, నిర్వహణ లోపాల కారణంగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మరో ప్రమాదం వెలుగుచూసింది. ఓ విమానం గాల్లో ఉండగానే రెక్క భాగం విరిగిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది తో సహా మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ ప్రయాణికుడు కిటికీ లోంచి వీడియో తీసి పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. చివరకు ఆ ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Also Read:Minister Nara Lokesh: నైపుణ్యం పోర్టల్‌పై లోకేష్ సమీక్ష.. కీలక ఆదేశాలు
ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆస్టిన్-బెర్గ్స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం 1893 ఫ్లాప్ విరిగి గాల్లోనే వేలాడింది. అది బోయింగ్ 737 విమానం. విమానం ల్యాండ్ కావడానికి ముందే, దాని ఎడమ రెక్క ఫ్లాప్ పాక్షికంగా విరిగి వేలాడుతోంది. దీనిని చూసి, విమానంలోని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇక తమ ప్రాణాలు గాల్లో కలిసినట్టే అని భావించారు. కానీ పైలట్స్ చాకచక్యంగా వ్యవహరించి సేఫ్ గా ల్యాండ్ చేశారు.
Also Read:Kukatpally Sahasra Case : కూకట్ పల్లి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు
ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ల్యాండింగ్ తర్వాత, డెల్టా ఎయిర్‌లైన్స్ ఫ్లాప్ విరిగిపోయిందని నిర్ధారించి, విమానాన్ని మెయిన్ టెనెన్స్ కోసం పంపించారు. మా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ఎయిర్‌లైన్ తెలిపింది. US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. FAA దర్యాప్తుకు సహకరిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఫ్లాప్‌లు అదనపు లిఫ్ట్, నియంత్రణను అందించడంలో సహాయపడతాయి.
WATCH: Delta Boeing 737-800 flight DL1893 from Orlando landed in Austin yesterday with the left wing aft flap detached.
📹: Shanila Arif pic.twitter.com/C7eI5AdG6Y— Turbine Traveller (@Turbinetraveler) August 21, 2025