NTV Telugu Site icon

Parliament Winter Session 2023: నాలుగో రోజుకి చేరుకున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

Untitled 4

Untitled 4

Delhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం అందరికి సుపరిచితమే. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజుతో నాలుగో రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు జరగనున్న సమావేశంలో రెండు ముఖ్యమైన బిల్లులను సమర్పించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ముఖ్యమైన బిల్లులను రాజ్య సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోరనున్నారు అమిత్ షా. వివారాలలోకి వెళ్తే.. ఈ రోజుతో (గురువారం) పార్లమెంట్‌లో కొనసాగుతున్న శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చేరుకున్నాయి. కాగా ఈ రోజు సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే..కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023 అలానే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023 అనే రెండు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

Read also:Chief Minister Revanth Reddy Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్

కాగా బుధవారం ఈ రెండు బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. అలానే డిపార్ట్‌మెంట్ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 249వ మరియు 250వ నివేదికలను బీజేపీ ఎంపీలు అనిల్ జైన్ అలానే నీరజ్ శేఖర్ రాజ్యసభలో సమర్పించనున్నారు. ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ (2023-24) స్టేట్‌మెంట్‌ను బిజెపి ఎంపి చెడ్డీ పాశ్వాన్ ప్రవేశపెట్టనున్నారు. కాగా బుధవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో ఖతార్‌లో 8 మంది మాజీ భారత నేవీ సిబ్బందికి విధించిన మరణశిక్షపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.