Parliament Winter Session : పార్లమెంటు ఉభయ సభల నిరవధిక వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Winter Session : నిర్ణీత షెడ్యూలు కంటే వారం ముందే పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 29 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది. ఆరు రోజులు ముందుగానే వాయిదాకు గురయ్యాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 7న మొదలు కావడం తెలిసిందే. లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ (బీఏసీ) సమావేశంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 23న వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Charles Sobhraj: జైలు నుంచి బయటకు వచ్చిన బికినీ కిల్లర్
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, అధికార, ప్రతిపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో 97 శాతం ఉత్పాదకత రేటు నమోదైనట్టు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మొత్తం 62 గంటల 42 నిమిషాల పాటు పనిచేసినట్టు చెప్పారు. చివరి రోజు శుక్రవారం కూడా పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ నియంత్రణ రేఖ వద్ద చైనా, భారత్ బలగాల ఘర్షణ అంశం ఈ విడత సమావేశాలను కుదిపేసిన వాటిల్లో ప్రధానమైనది. దీన్ని అడ్డం పెట్టుకుని అధికార బీజేపీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. ఘటనపై ప్రభుత్వం ఉభయసభల్లో ప్రకటనలు చేసి చేతులు దులుపుకోగా.. ప్రతిపక్షాలు మాత్రం సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టాయి. ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడంతో నిత్యం రభస కొనసాగింది.
Read Also: Russia Ukraine War : రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ ?
ఇక రాజ్యసభ 258వ సెషన్ కూడా నిర్ణీత షెడ్యూలు కంటే ఆరు రోజుల ముందుగా శుక్రవారం వాయిదా పడింది. చైర్మన్ జగదీప్ ధన్ఖర్ సభను వాయిదా వేస్తూ సభలో తాను భాగమవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్రిస్మస్, పొంగల్, లోహ్రీ, ఇతర పండుగల నేపథ్యంలో సభ్యులకు ఛైర్మన్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. పెరుగుతున్న కోవిడ్ మహమ్మారి కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!