రేపుటి ( సోమవారం ) నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా నేడు (ఆదివారం) అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్ర ప్రభుత్వం భేటీ కానుంది. ఈ సెషన్స్ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఐదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.
Read Also: Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి!
ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ది అడ్వొకేట్స్(సవరణ)బిల్లు–2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023, ది పోస్టాఫీస్ బిల్లు–2023లను ఈ సెషన్‌లో లోక్‌సభలో కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులతో గత సెషన్స్ లో రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లును ఈసారి చర్చకు తీసుకురానుంది. అయితే, అనూహ్యంగా మరికొన్ని అంశాలను సైతం సభ ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జోరుగా కొనసాగుతుంది.
Read Also: Bigg Boss 7 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?
లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళల కోటా కల్పించే బిల్లును ఈ ప్రత్యేక సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ స్పెషల్ సెషన్ సమయంలోనే పార్లమెంట్‌ను నూతన భవనంలోకి మార్చనుట్లు తెలుస్తుంది. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోడీ మే 28వ తేదీ ప్రారంభించారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లోకి మారిన తర్వాత సిబ్బంది కొత్త యూనిఫాంపై బీజేపీ సింబల్ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Guinness Record For Hair: కురులతో కుర్రాడి గిన్నిస్ రికార్డ్.. జుట్టు పొడవు ఎంతో తెలుసా?
పార్లమెంట్ సిబ్బంది యూనిఫాంపై కూడా ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడ్డే అవకాశం ఉంది. ప్రధాని మోడీ సారథ్యంలో దేశ రాజధానిలో ఇటీవల విజయవంతంగా ముగిసిన జీ20 శిఖరాగ్రం అంశాన్ని పాలకపక్షం చర్చకు తీసుకు వస్తుందని అందరు భావిస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ పై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ నేడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.