ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. లోక్‌సభలో ఈ చర్చను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడనున్నారు. దీంతో పాటు మణిపూర్ హింసపై రాహుల్ ఎలాంటి ప్రసంగం చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read Also: Vizag Road Accident: రుషికొండ బీచ్ వద్ద కారు బీభత్సం.. బైక్‌ని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి
గత మూడు నెలలుగా హింసాకాండతో రగిలిపోతున్న మణిపూర్‌లోని ఘర్షణ ప్రాంతాలను జూన్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సందర్శించారు. ఈ క్రమంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మాన చర్చలో రాహుల్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలుస్తారాని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 7 గంటల వరకూ జరుగుతుంది. ఇలా వరుసగా మూడు రోజుల పాటు చర్చ జరుగుతుంది. అనంతరం చివరి రోజైనా ఆగస్టు 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ చర్చకు సమాధానమిస్తారు. అదే రోజు గురువారం నాడు లోక్ సభలో ఓటింగ్ నిర్వహించనున్నారు.
Read Also: IT Tower: రేపు నిజామాబాద్ లో ఐటీ టవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
కాగా.. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272.. లోక్‌సభలో ఎన్డీయే కూటమి 331 ఎంపీల బలం ఉంది. బీజేపీకి సొంతంగానే 301 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి బలం 144, బీఆర్‌ఎస్, వైసీపీ, బీజేడీకి కలిపి 70 మంది ఎంపీల బలం ఉంది. అయితే లోక్‌సభలో 64 మంది ఎంపీలు తటస్థంగా ఉండగా.. ఆరు ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్డీయే కూటమికి అనుకూలంగా 273 మంది ఎంపీల మద్దతు తెలిపితే.. అవిశ్వాస తీర్మానం ఈజీగా వీగిపోతుంది.. మరి చూడాలి విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బలపడుతుందా.. లేక విగిపోతుందా అనేది.