NTV Telugu Site icon

Parliament Session: నేడు పార్లమెంట్‌ సమావేశాలు..విద్యార్థుల మృతి అంశాన్ని లేవనెత్తే అవకాశం!

Parliament

Parliament

వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో వాతావరణం వేడెక్కింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. విపక్షాలు బడ్జెట్‌ను వివక్షపూరితంగా అభివర్ణించాయి. దీని తర్వాత.. చాలా ప్రతిపక్ష పార్టీలు కూడా నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఈరోజు కూడా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాలు రభస సృష్టించవచ్చు. కాగా, ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల మృతి అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తెలిపారు.

READ MORE: Pakistan : పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 36 మంది మృతి, 162 మందికి గాయాలు

గత సమావేశంలో పెద్ద దుమారం..
శుక్రవారం లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే విపక్షాలు గందరగోళం సృష్టించాయి. తాను రూలింగ్ ఇస్తున్నానని.. అందరూ కూర్చొని ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ సభకు గొప్ప గౌరవం, ఉన్నత సంప్రదాయాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రపంచంలో భారతదేశ ఖ్యాతిని చాటేలా సంప్రదాయం ఉండాలని కోరారు. వీలైనంత వరకు సభ గౌరవాన్ని కాపాడుకుందామన్నారు..

READ MORE: Figs Health Benefits: అంజీర పండ్లను అలసత్వం చేయొద్దు.. ముఖ్యంగా గర్భిణీలు.. ఎందుకంటే.?

ఢిల్లీలో విద్యార్థుల మృతి అంశంపై స్వాతిమలివాల్..
రాజేంద్రనగర్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో నీటి ఉధృతి కారణంగా ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. ఈ విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మాట్లాడుతూ.. ముగ్గురు విద్యార్థినుల మృతి అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. స్వాతి మలివాల్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ (RML)కి వెళ్లారు. ఇక్కడ మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. సమావేశం అనంతరం స్వాతి తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. “రాజేంద్ర నగర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కుమార్తెల కుటుంబాలను ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో కలిశాను” అని రాశారు.

Show comments