సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సోదరుడి వ్యాఖ్యలపై దుమారం చేలరేగింది. దీంతో.. వైసీపీ నేతలకు కౌంటర్ గా టీడీపీ నేతల వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ వర్గీయులప్తె వ్తెసీపీ నేతల దాడి, కారు అద్దాలు ధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిసికె పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట పరిటాల సునీత, టీడీపీ శ్రేణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లపై చేసిన వ్యాఖ్యలప్తె తీవ్ర దుమారం రేగింది.
Also Read :Kishan Reddy Padayatra: కిషన్ రెడ్డి పాదయాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభం
పరుష పదజాలంతో ఎమ్మెల్యే సోదరుడు చేసిన వ్యాఖ్యలప్తె టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈనేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు విచారించారు. అయితే.. టీడీపీ నేతలపై దాడి చేయడం ఉద్రికత్తలకు దారితీసింది. మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు వ్యాఖ్యలపై స్పందించిన బత్తలపల్లికి చెందిన టీడీపీ నేత జగ్గు కౌంటర్ ఇచ్చారు. దీనితో జగ్గును శనివారం రాత్రు పోలీసులు తీసుకెళ్లారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగ్గు కోసం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన తమ నాయకులపై వైసీపీ దాడికి దిగారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు.