Paralympic 2024: పారాలింపిక్స్ విజేతలకు భారీ నజరానా.. పసిడికి రూ.75 లక్షలు!
- రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు
- పారాలింపిక్స్ 2024లో 29 పతకాలు
- విజేతలకు భారీ నజరానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Para Gold Medallists Get 75 Lakh Cash Reward: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు అంచనాలను మించి రాణించారు. రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు పారిస్ క్రీడల్లో పాల్గొనగా.. 29 పతకాలు సాధించారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు సాధించిన భారత్.. ఈసారి 29 పతకాలు గెలిచింది. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పారిస్‌లో చరిత్రాత్మక ప్రదర్శన చేసిన పారా అథ్లెట్లు మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు.
పారా యోధులకు దేశరాజధాని ఢిల్లీలో ఘనస్వాగతం దక్కింది. ఇందిరా గాంధీ విమానాశ్రయం వద్ద వేచి ఉన్న వందల మంది అభిమానులు.. ఎయిర్ పోర్ట్ నుంచి పారా అథ్లెట్లు బయటికి రాగానే వారికి ‘జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. అథ్లెట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, అధికారులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. పతకాలు గెలిచిన పారా అథ్లెట్లను క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ సన్మానించారు. ఈ సందర్భంగా పతకాలు గెలిచిన భారత క్రీడాకారులకు ఆయన నజరానాలు ప్రకటించారు.
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
Also Read: iPhone Prices Drop: భారీగా తగ్గిన ‘ఐఫోన్’ ధరలు.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
పారిస్ పారాలింపిక్స్ 2024లో స్వర్ణం గెలిచిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.75 లక్షలు ఇస్తున్నట్లు క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ ప్రకటించారు. రజతం గెలిచిన అథ్లెట్లకు రూ.50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.30 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 2028 లాస్ ఏంజెలెస్ పారాలింపిక్స్‌లో భారత్ మరిన్ని ఎక్కువ పతకాలు సాధించేలా ప్రోత్సాహాన్ని అందిస్తామని మన్సుక్ చెప్పారు.
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!