Site icon NTV Telugu

Chhattisgarh: మొబైల్ గేమ్స్ ఆడిందని తిట్టిన పేరెంట్స్.. 110 అడుగుల నుంచి జంప్

Lady Jump

Lady Jump

భారతదేశంలో మినీ నయాగరాగా పేరుగాంచిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని చిత్రకోట్ జలపాతంలో ఆత్యహత్య చేసుకునేందుకు ఓ యువతి దూకింది. జ‌ల‌పాతం దగ్గర ఉన్న వ్యక్తులు.. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా.. ఆమె నీటిలో దూకేసింది. ఆ యువ‌తి దాదాపు 110 అడుగుల ఎత్తు నుంచి వాటర్ ఫాల్స్ లోకి దూకింది. అదృష్టవశాత్తూ ఆమె చావు నుంచి తప్పించుకుంది.

Read Also: Rajasthan : ప్రియురాలి భర్తను ముక్కలుగా చేసి మొక్కలు నాటిన ప్రియుడు.. దారుణం..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని లొహందీగూడలో నివాసముంటున్న యువ‌తి మొబైల్‌లో గేమ్స్ ఆడుతోందని ఆమె కుటుంబ‌ స‌భ్యులు మందలించారు. దీంతో కోపంతో యువ‌తి జలపాతంలోకి దూకేసింది. యువతి దూకడం చాలా మంది చూశారు.. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న వారు చూసి భయపడ్డారు. జవాన్లు కూడా యువ‌తిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆమె జ‌ల‌పాతంలోకి దూకేసింది. అయితే.. యువ‌తి నీటిలోంచి తేలడాన్ని చూసి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఘటనను వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

Read Also: Funny Cricket Video: బంతి ఇవ్వనన్న బ్యాటర్.. వెంటపడిన కీపర్! వీడేమో చూస్తే అస్సలు నవ్వాగదు

అయితే, ప్రజలు, పోలీసులు యువ‌తిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఆమె జలపాతంలోకి దూకిందని అక్కడున్న వారు తెలిపారు. పోలీసులు తెలిపి వివారాల ప్రకారం.. 18ఏళ్ల కుమారి సరస్వతి మౌర్య.. ఆమె తండ్రి పేరు శాంటో మౌర్య.. నిన్న (మంగళవారం) మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మొబైల్‌లో గేమ్స్‌ ఎక్కువగా ఆడుతుంద‌ని బాలిక తల్లిదండ్రులు ఆమెను తిట్టారు. దీంతో కోపంలో యువ‌తి చిత్రకూట్ జలపాతం దగ్గరకు వెళ్లి అందులో దూకేసింది. ఆ తర్వాత ఆమెనే స్వయంగా ఈత కొట్టుకుంటూ తిరిగి పైకి వచ్చింది. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

Exit mobile version