Hyderabad : హైదరాబాద్ నగరంలోని పారా మౌంట్ కాలనీలో తెల్లవారుజామున పెద్దఎత్తున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, విదేశీయుల అక్రమ నివాసాలపై ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 150 మంది పోలీసులు తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఈ కాలనీని చుట్టుముట్టి సోదాలు ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, హెచ్‌ఎన్‌యూ, ఏఆర్ విభాగాలకు చెందిన పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు.
ఈ సెర్చ్‌లో నైజీరియా, ఇథియోపియా, కెన్యా, సోమాలియా దేశాలకు చెందిన వలసదారులు పెద్దఎత్తున ఉన్నట్లు గుర్తించారు. వీరిలో చాలామంది భారతదేశం వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివసిస్తూ ఇల్లీగల్ కార్యకలాపాల్లో భాగం అవుతున్నట్లు పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల్లో మొత్తం 18 మంది విదేశీయులు వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా జీవిస్తున్నట్లు గుర్తించారు. వారిని గుర్తించిన పోలీసులు త్వరలోనే డిపోర్ట్ చేయనున్నట్లు ప్రకటించారు.
Gold Rates: కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
ఈ సోదాల సందర్భంగా డాక్యుమెంట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 50కి పైగా బైకులు, 5 కార్లను పోలీసులు సీజ్ చేశారు. అంతేకాక, గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న బెల్ట్ షాపులు, హుక్కా సెంటర్లను గుర్తించి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు, గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. మద్యం అక్రమ నిల్వలు బయటపడటంతో, స్థానికంగా నడుస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై మరింత దృష్టి పెట్టనున్నారు పోలీసులు.
ఈ సందర్భంగా సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ మాట్లాడుతూ, “పారా మౌంట్ కాలనీలో కార్డన్ సెర్చ్‌తో పాటు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించాం. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండిపోయిన విదేశీయులను గుర్తించాం. వారి వివరాలు సేకరించి, త్వరలోనే డిపోర్ట్ చేయనున్నాం. మాదకద్రవ్యాల విషయంలో మేము చాలా సీరియస్‌గా ఉన్నాం. ఈ సెర్చ్‌లో డ్రగ్స్ లభించలేదు. కానీ భవిష్యత్‌లో ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ కార్డన్ సెర్చ్‌తో నగరంలోని ఇతర అనుమానస్పద ప్రాంతాల్లో కూడా ఇలాంటి తనిఖీలు జరపనున్నట్లు పోలీసులు సంకేతాలు ఇస్తున్నారు. విదేశీయుల పేరుతో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ఇది ఒక ముందడుగుగా మారింది.
Kadapa Municipal: నేడు కడప కార్పొరేషన్ సమావేశం.. భారీ బందోబస్తు ఏర్పాటు! కుర్చీ గోలకు పుల్‌స్టాప్
