NTV Telugu Site icon

Sudan: సూడాన్‌లోని వాద్ అల్ నౌరా గ్రామంపై పారామిలిటరీ రాపిడ్ ఫోర్సు దాడి..దాదాపు 150 మంది మృతి

New Project (65)

New Project (65)

సూడాన్‌లో తిరుగుబాటు దళాల దాడిలో దాదాపు 150 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, సాక్షులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడాది కాలం యుద్ధంలో ఇప్పటి వరకు 7 మిలియన్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. సెంట్రల్ సూడాన్‌లోని(గెజిరా) వాద్ అల్ నౌరా గ్రామంపై పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్.ఎస్.ఎఫ్) చేసిన దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 150 మంది మరణించారు. ఈ ఘటనను వాద్ మదానీ రెసిస్టెన్స్ కమిటీలు సోషల్ మీడియా ద్వారా నిర్ధారించాయి.

READ MORE: Russia: రష్యాలోని వోల్ఖోవ్ నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థుల మృతి

సుడాన్ యొక్క పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) నుంచి యోధులు బుధవారం సెంట్రల్ అల్-జజీరా రాష్ట్రంలోని వాద్ అల్-నౌర్ గ్రామంలోకి ప్రవేశించారు. 40కి పైగా సాయుధ వాహనాలు గ్రామంలోకి దూసుకొచ్చాయి. నివాసులపై భారీ ఆయుధాలను ప్రయోగించాయి. దీంతో గ్రామంలో భయాందోళన వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది పౌరులు మృత్యువాత పడ్డారు. వందలకు పైగా జనాలకు గాయాలయ్యాయి. మారణహోమ దృశ్యాలను వారు” ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ” కు వివరించారు.

READ MORE: Russia: రష్యాలోని వోల్ఖోవ్ నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థుల మృతి

“ఇప్పటివరకు, మేము గ్రామం మధ్యలో ఉన్న సామూహిక సమాధిలో 120 మందికి పైగా ఖననం చేసాము.” అని ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. ఫుటేజీ బుధవారం సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేశారు. అందులో వాద్ అల్-నౌరా గ్రామంలో డజన్ల కొద్దీ మృతదేహాలను చుట్టుముట్టిన పెద్ద గుంపు కనిపిస్తుంది. మధ్యలో ఉన్న మృతదేహాలపై తెల్లటి రంగు వస్త్రాలు కప్పారు. వాటి ఖననం కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు చూడొచ్చు. మరో వీడియోలో ఆర్‌ఎస్‌ఎఫ్ మిలీషియా భారీ, మధ్యస్థ ఆయుధాలతో గ్రామం వైపు కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తుంది.