Parachute Training: 50 అడుగుల ఎత్తులో పారాచూట్ ఫెయిల్.. ఇద్దరు సైనికులకు గాయాలు
- భారత సైన్యం నిర్వహించిన పారాచూట్ శిక్షణ విన్యాసంలో అవాంతరం
- 50 అడుగుల ఎత్తులో పారాచూట్ ఫెయిల్
- ఇద్దరు సైనికులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని బళ్లారి జిల్లా పి.డి. హళ్ళి ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన పారాచూట్ శిక్షణ విన్యాసంలో అవాంతరం సంభవించింది. ల్యాండింగ్ సమయంలో పారాచూట్ సరిగా పనిచేయకపోవడంతో ఇద్దరు సైనికులు సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడి గాయపడ్డారు. ఈ శిక్షణలో మొత్తం 417 మంది సైనికులు పాల్గొన్నారు. ఘటనలో గాయపడిన ఇద్దరు సైనికుల్లో ఒకరు 25 ఏళ్ల చిన్నరాజ్ అని తెలుస్తోంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, వారి పరిస్థితి దృష్ట్యా హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు ఏర్లిఫ్ట్ చేశారు. అక్కడ అధునాతన వైద్య సదుపాయాలతో చికిత్స కొనసాగుతోంది.
Also Read
ప్రస్తుతం ఇద్దరు సైనికుల పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సైన్యం అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పారాచూట్ శిక్షణలో ఇలాంటి అవాంతరాలు అరుదుగా జరిగినప్పటికీ, సైనికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన సైనిక శిక్షణలో ఉన్న రిస్క్‌లను మళ్లీ గుర్తు చేసింది. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!