NTV Telugu Site icon

NEET issue: నీట్ ఇష్యూ, పేపర్‌ లీకులపై లోక్‌సభలో స్పందించిన ప్రధాని మోడీ..

Pm

Pm

NEET issue: నీట్ సమస్య, పేపర్ లీకులపై ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో స్పందించారు. దేశంలో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం సీరియస్‌‌గా ఉందని ప్రతీ విద్యార్థికి, దేశంలో ప్రతీ యువకుడికి చెబుతున్నానని భరోసా ఇచ్చారు. యువత భవిష్యత్తుతో ఆటలాడే వారిని వదిలిపెట్టబోమని, నీట్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయని అన్నారు. మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన నీట్-యూజీ పేపర్ లీక్‌పై తీవ్ర విచారం వ్యక్తం చేశానని, పేపర్ లీక్‌కు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

Read Also: Crime News: మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఆమె కథ మారలేదు.. చివరికి ఏమైందంటే..?

మరోవైపు కాంగ్రెస్, రాహుల్ గాంధీపై ప్రధాని విరుచుకుపడ్డారు. పిల్లాడి మనస్తత్వానికి జ్ఞానోదయం కలుగుతుందని ఆశిస్తున్నట్లు పరోక్షంగా సెటైర్లు వేశారు. వారికి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండాయని, ఆ సమయంలో అధికారంలో ఉన్న వ్యక్తుల మనస్తత్వం అన్ని హద్దులు దాటిందని, ప్రభుత్వాలను పగగొట్టడం, మీడియాను అణిచివేడయం, ప్రతిదీ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా జరిగిందని అన్నారు. దేశంలో దళితులు, వెనకబడిన వారికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.