NTV Telugu Site icon

Papaya Seeds : పండు తిని గింజలని పారేస్తే పొరపాటే

Papaya Seeds

Papaya Seeds

Papaya Seeds : ప్రతీ భారతీయుడు బొప్పాయిని ఇష్టంగా తింటారు. ఇది చాలా రుచికరమైన పండు. పైగా చాలా చౌకగా దొరుకుతుంది. అందువల్లే పేద, ధనిక అన్నా తేడా లేకుండా అందరూ తింటారు. కానీ చాలా మంది బొప్పాయిని తినేటప్పుడు గింజలను డస్ట్‌బిన్‌లో వేస్తారు. ఈ పండును పండించాలనుకునే వారు ఈ విత్తనాలను ఉపయోగిస్తారు. అయితే ఈ విత్తనం అనేక ఇతర వ్యాధుల నివారణలో కూడా ఉపయోగపడుతుంది.

బొప్పాయి గింజల ప్రయోజనాలు
బొప్పాయి గింజలు నలుపు రంగులో ఉంటాయి. అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. నేరుగా తింటే చేదుగా ఉంటుంది. సాధారణంగా విత్తనాన్ని ముందుగా ఎండలో ఎండబెట్టి, తర్వాత మెత్తగా చేసి తింటారు.

Read Also: Team India : ఆమిర్ ఖాన్ ను ట్రోల్ చేసిన రోహిత్ సేన

ప్రస్తుతం భారతదేశంలో, గుండె జబ్బుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణించారన్న వార్తలు వింటూనే ఉన్నాం. ఈ సందర్భంలో బొప్పాయి గింజలు ప్రాణాలను రక్షించే మూలిక కంటే తక్కువేమీ కాదు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ఈ విత్తనాల సహాయంతో రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.

Read Also: Rishab Pant : రిషబ్ పంత్ ఇంటికి మాజీ క్రికెటర్లు

బొప్పాయి గింజలు మంటను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ గింజల్లో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరంలో వాపు తగ్గుతుంది. చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, బొప్పాయి గింజలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి.