NTV Telugu Site icon

Gun Fire Incident: రొంపిచర్ల కాల్పుల ఘటన.. దాడికి కారణం ఏమిటంటే?

Palnadu Incident

Palnadu Incident

Gun Fire Incident: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై జరిగిన కాల్పుల గురించి జిల్లా ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. రొంపిచర్ల మండలంలోని టీడీపీ నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయన్నారు.

యంపీటీసీ పదవి వివాదంతో పాటు ఆరున్నర లక్షలు రూపాయలు వెంకటేశ్వరరెడ్డికి బాలకోటి రెడ్డి ఇవ్వాలని.. ఈ నేపథ్యంలోనే గొడవలు జరిగాయని చెప్పారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి శివారెడ్డి పేరుతో డోర్ తట్టారని.. బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు డోర్ తీసిన తర్వాత కాల్పులు జరిపాడని ఎస్పీ వెల్లడించారు.

adala prabhakar reddy: నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌ఛార్జీగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి!

ఫిరంగిపురానికి చెందిన అంజిరెడ్డితో వెంకటేశ్వరరెడ్డికి జైలులో పరిచయం అయింది. తనకు ఒక సాయం చేయాలని వెంకటేశ్వర రెడ్డి అంజిరెడ్డిని అడిగాడు. అంజిరెడ్డి , వెంకటేశ్వర రెడ్డిలు అరవై వేల రూపాయలకు రాజస్థాన్‌లో తుపాకీ కొనుగోలు చేశారు. ఆ తుపాకీతోనే రాత్రి వెంకటేశ్వరరెడ్డి బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపాడని జిల్లా ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి చెప్పారు. వెంకటేశ్వరరెడ్డి ఈ హత్యాయత్నానికి ప్లాన్ చేశాడని.. టీడీపీ ఇంఛార్జి అరవింద్ బాబుకి వెంకటేశ్వరెడ్డి అభిమాని అంటూ ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనలో రాజకీయ కక్షలు ప్రత్యర్థి పార్టీల దాడులు కారణం కాదన్నారు.