Site icon NTV Telugu

Ex-MLA Gopireddy Srinivasa Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

Gopireddy Srinivasa Reddy

Gopireddy Srinivasa Reddy

YCP Ex-MLA Gopireddy Srinivasa Reddy : పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం నరసరావుపేటలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుచరులతో కలిసి గోపిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. గోపిరెడ్డితో పాటూ మరో 22 మంది అనుచరులపై నరసరావుపేట వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

READ MORE: Lawyer Misbehaves Women: ఎందయ్యా ఇది.. నువ్వు న్యాయవాదివా.. కామ వాదివా..

కాగా.. రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో, నకిలీ మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం డోర్ డెలివరీ చేయిస్తున్నారని విమర్శిస్తూ, ఈ విషయమై ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై తాజాగా కేసు నమోదైంది.

READ MORE: Kantara-Chapter-1 : కాంతార చాప్టర్ 1 నుంచి దీపావళి గిఫ్ట్ రెడీ! ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్‌లో

Exit mobile version