YCP Ex-MLA Arrest: పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం నరసరావుపేటలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుచరులతో కలిసి గోపిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. గోపిరెడ్డితో పాటూ మరో 22 మంది అనుచరులపై నరసరావుపేట వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.