బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ కి అస్సలు దక్కలేదు. అనూహ్యంగా అతడు అరెస్ట్ అయ్యాడు. డిసెంబర్ 17 రాత్రి అన్నపూర్ణ స్టూడియో ఎదుట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు.. పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ ని ధ్వంసం చేశారు. బయట గొడవగా ఉందని పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక డోర్ నుండి పంపించారు. అయితే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు.దీంతో పల్లవి ప్రశాంత్ పై పోలీసులు పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్ ని పోలీసులు తన స్వగ్రామంలో అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ ను విధించింది. పల్లవి ప్రశాంత్ ని బయటకు తీసుకురావాలని లాయర్లు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై మాజీ కంటెస్టెంట్స్ తో పాటు సీజన్ 7 కంటెస్టెంట్స్ కూడా స్పందిస్తున్నారు. భోలే షావలి అరెస్ట్ విషయం తెలుసుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అలాగే మీడియాతో మాట్లాడుతూ అతడికి లా అండ్ ఆర్డర్ గురించి తెలియదు. అభిమానులను చూసి ఆనందంలో ర్యాలీ చేశాడు. అత్యుత్సాహంలో జరిగిన పొరపాట్లు తప్పితే కావాలని చేసింది లేదు అని అన్నాడు.హౌస్ లో ఎంతో కష్టపడి ఆడాడు. ప్రశాంత్ ని వదిలేయాలని భోలే షావలి అన్నారు.అలాగే మరొక కంటెస్టెంట్ అశ్విని శ్రీ కూడా ఎంతో ఆవేదన చెందారు. అశ్విని శ్రీ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించింది.ఫ్యాన్స్ చేసిన తప్పుకు పాపం పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం ఏమిటీ.. ఇది చాలా తప్పు.. నాకు మాటలు కూడా రావడం లేదు. వాడు చాలా మంచి వాడు,అమాయకుడు. దయ చేసి నా తమ్ముడిని బయటకు తీసుకురండి, అని చేతులు జోడించి వేడుకుంది. ప్రస్తుతం అశ్విని శ్రీ వీడియో వైరల్ అవుతుంది.అయితే బిగ్ బాస్ ఫైనల్ రోజు అశ్విని శ్రీ కారు అద్దాలు కూడా పగలగొట్టారు. ఆమె చాలా ఆవేదన చెందారు. ఆ పని చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ప్రచారం అయితే జరిగింది. అయినప్పటికీ అశ్విని శ్రీ పల్లవి ప్రశాంత్ కి ఎంతో మద్దతుగా నిలిచింది.